గైరోవేటర్ SLX | వ్యవసాయ పనిముట్లు | పొలం పరికరాలు | మహీంద్రా ట్రాక్టర్లు

గైరోవేటర Slx

మహీంద్రా గైరొవేటర్ ఎస్ఎల్ఎక్స్ ట్రాక్టర్ పై మౌంట్ చేయబడే మరియు పిటిఒ ద్వారా నడపబడే పరికరం, ఇది ఒకే సమయంలో 3 కార్యకలాపాలు చేస్తుంది అంటే, కోయడం మట్టి కలపడం ఇంకా లెవెలింగ్ చేయడం. భారీ మరియు అతుక్కుంటూ ఉండే నేలలు కోసం ఎస్ఎల్ఎక్స్ సీరీస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

 
   
 
 
 
ಸೂಚನೆ: ಚಿತ್ರವು ಕೇವಲ ಪ್ರಾತಿನಿಧ್ಯದ ಉದ್ದೇಶಗಳಿಗೆ ಮಾತ್ರ.

లక్షణాలు

 • నిర్వహణ సమస్యలు ఏమీ లేవు: దీర్ఘ కాలం మన్నిక
 • వివిధ అప్లికేషన్ కోసం ఫైన్ లోతు ఎడ్జస్టర్.

 • మంచి సామర్థ్యం కోసం అదే గ్యాంగ్ షాఫ్ట్ పై మల్టీ బ్లేడ్ సర్దుబాటు (ఐ & సి రకం)
 • గైరొవేటర్ తో చదును చేయబడిన ఉపరితలంతో మంచి ఇంధన సామర్థ్యం వీలవుతుంది.

 • వాటర్ టైట్ సీలింగ్ తడి మరియు పొడి నేలలో మెరుగైన ఉపయోగానికి వీలుకల్పిస్తుంది.
 • నేల పై తక్కువ ఒత్తిడి వలన గాలి మరియు నీరు మంచిగా కలిసిపోవడానికి దోహదపడుతుంది

 • బియ్యం/వరి పంటకోతల తర్వాత, హ్యూమస్ (పచ్చి ఎరువు) పెంచడానికి పంట అవశేషాలను ఇది మధిస్తుంది.
 • దుబ్బులని అద్భుతంగా కోయడం, కలపడం ఇంకా ఎరువుని మెరుగ్గా కలపడాన్ని నిర్ధారిస్తుంది. మట్టి పెళ్ళలని మెత్తగా చేస్తుంది అంటే మెరుగ్గా దున్నడం.

 • పుడ్లర్/ డిస్క్ హారోతో పోలిస్తే మట్టిని మెరుగ్గా మధించడం మరియు తక్కువ జారిపోవడం కారణంగా పుడ్లింగ్ (నీరు మునిగేలాగా పెట్టిన వ్యవసాయం) కోసం ప్రభావవంతమైనది.
 • సర్దుబాటు చేసుకోదగిన ట్రెయిలింగ్ బోర్డు.

 • గైరొవేటర్ షాఫ్ట్ యొక్క 4 విభిన్న స్పీడ్ ల కోసం ప్రత్యేకమైన గేర్ బాక్స్.
 • వివిధ అప్లికేషన్ల కోసం మల్టీ స్పీడ్ ఎడ్జస్థర్.

 • శబ్దం లేకుండా తేలికగా పనిచేసేందుకు అంతర్జాతీయంగా డిజైన్ చేయబడిన రేంజ్.

లక్షణాలు

మోడల్స్ SLX 150 SLX 175 SLX 200
పనిచేసే వెడల్పు 1.5 m 1.75 m 2.0 m
కోసే వెడ్లపు 1.46 m 1.70 m 1.96 m
ఫ్లాంజస్ సంఖ్య 7 8 9
బ్లేడ్ల సంఖ్య 36 42 48
బ్లేడ్ల రకం L - రకం L - రకం L - రకం
బరువు 460 (సుమారు.) 500 (సుమారు.) 520(సుమారు.)
ప్రైమరీ గేర్ బాక్స్ మల్టీ స్పీడ్ మల్టీ స్పీడ్ మల్టీ స్పీడ్
సెకండరీ గేర్ బాక్స్ గేర్ డ్రైవ్ గేర్ డ్రైవ్ గేర్ డ్రైవ్
అవసరమైన ట్రాక్టర్ HP 33.6-37.8 kW (45-50 HP) 37.8-41.0 kW (50-55 HP) 41.0-44.7 kW (55-60 HP)

మహీంద్రా ట్రాక్టర్ తో లాభాలు

 • గైరోవేటర్ తో మ్యాచ్ అయ్యేందుకు మహీంద్రా ట్రాక్టర్ల మెరుగైన లాగుడు శక్తి మరియు పరిపూర్ణ వేగం
 • తక్కువ ఇంధన వినియోగం.

 • పొడి మరియు తడి కార్యకలాపాల్లో నేలని అత్యుత్తమంగా పల్వరైజ్ (మెత్తటి పొడుంగా) చేయడం