ట్రాక్టర్ ష్రెడ్డర్ | వ్యవసాయ పనిముట్లు | పొలం పనిముట్లు | మహీంద్రా ట్రాక్టర్లు

ష్రెడ్డర్

మహీంద్రా ష్రెడ్డర్ పొలంలో ఒక ముఖ్యమైన వ్యవసాయ కార్యకలాపం పంట అవశేషాలని నిర్వహిస్తుంది.ష్రెడ్డర్ అవశేష పంట చిన్నచిన్న ముక్కలుగా చేసి దానినే తిరిగి నేలతో కలుపుతుంది, ఇది తదుపరి పంట కోసం ఒక సహజ కంపోస్ట్ అవుతుంది.

 
   
 
 
 
ಸೂಚನೆ: ಚಿತ್ರವು ಕೇವಲ ಪ್ರಾತಿನಿಧ್ಯದ ಉದ್ದೇಶಗಳಿಗೆ ಮಾತ್ರ.

లక్షణాలు

  • సమర్థవంతంగా మరియు ప్రభావవంతంగా తదుపరి పంట సీజన్ కోసం పొలం క్లియర్ చేయడానికి సహాయపడుతుంది.
  • మూడు పాయింట్ల లింకేజ్ ఎక్కించబడిన పరికరం మరియు ఒక చోటు నుంచి మరొక చోటికి ఒక రోటవేటర్ లాగా చేరవేసుకోవచ్చు.

  • ఎండుగడ్డిని పశువుల గ్రాసంగా ఉపయోగించగలిగేందుకు వీలుగా అది సన్నని చిన్న చిన్న ముక్కలుగా కోయబడుతుంది. పశుగ్రాసాన్ని పశువుల యజమానులకు అమ్మడం కూడా అదనపు ఆదాయాన్ని కల్పించడంలో సహాయపడుతుంది.
  • అధిక ఆర్పీఎం రోటర్ స్పీడ్ వద్ద నాణ్యమైన ష్రెడ్డింగ్ (చిన్న చిన్న ముక్కలుగా చేయడం).

  • మహీంద్రా ష్రెడ్డర్ మట్టి ఉపరితలంపై పని చేస్తుంది అందుకే మట్టికి హాని చేయదు.
  • సెంటర్ లో ఎక్కి కూర్చునేదిగా అలాగే ట్రాక్టర్ ఆఫ్సెట్ గా కూడా ఉపయోగించవచ్చు.

  • ప్రత్యేకంగా చెరకు, పత్తి, వరి, గోధుమ పంట అవశేషాల నిర్వహణ కోసం రూపొందించబడింది.

లక్షణాలు

 ష్రెడ్డర్160
అవసరమైన ట్రాక్టర్ Hp26.1 to 29.8 kW(35 to 40 HP)
పనిచేసే వెడల్పు (cm)లో160
మొత్తం వెడల్పు (cm)లో175
బ్లేడ్ల సంఖ్య22
బరువు కిగ్రా ల్లో (సుమారు)275
ట్రాక్టర్ పిటిఒ ఆర్పిఎం540 r/min

మహీంద్రా ట్రాక్టర్ తో లాభాలు

  • ట్రాక్టర్ తో జోడించడం సులభం.
  • పొలం యొక్క మెరుగైన కవరేజ్ ఇస్తుంది.

  • డ్యూయల్ క్లచ్ ఫీచర్ కారణంగా, గేర్ మార్పు కోసం క్లచ్ నొక్కబడినప్పుడు పిటిఒ కార్యకలాపం ప్రభావితం కాదు.