మహీంద్రా ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్‌లో, కార్మిక కొరతను ఎదుర్కొని, సామర్థ్యాలను పెంచి, వ్యవసాయ కార్యకలాపాల వ్యయాన్ని తగ్గించి మరియు పంట దిగుబడి పెంచేలా భారతీయ రైతులకు సహాయపడటానికి విస్తృతమైన ప్రగతిశీల వ్యవసాయక్షేత్ర యంత్రాలను తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తాము. మా ప్రపంచ స్థాయి పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు మరియు తయారీ కర్మాగారాలలో వ్యవసాయ పరికరాల రూపకల్పన, అభివృద్ధి మరియు తయారీని నిర్వహిస్తాము. మన రైతులకు అధునాతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడానికి భారతదేశం మరియు విదేశాలలోని ఉత్తమమైన సంస్థలతో కలిసి పనిచేస్తాము. బంగాళాదుంప నాటుకు, బేలింగ్, స్ప్రేయింగ్ మరియు వరినూర్పిడి కోసం యంత్రాలను ప్రవేశపెట్టడానికి మేము యూరప్‌లోని డెవుల్ఫ్, టర్కీలోని హిసార్లార్, భారతదేశంలోని మిత్రా మరియు జపాన్‌లోని మిట్‌సుభిషి అగ్రికల్చరల్ మెషినరీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాము.
విస్తృతమైన పంటలకు మరియు వ్యవసాయ పరిమాణాలకు సరిపోయేలా భూమి తయారీ నుండి కోత పూర్తయ్యే వరకు అయ్యే పనుల కొరకు మాకు విస్తృతమైన ట్రాక్టర్ పరికరాలు మరియు స్వయంచాలక వ్యవసాయ యంత్రాలు ఉన్నాయి. మా ఉత్పత్తులు రైతుకు అంతిమ కార్యాచరణ సౌలభ్యం మరియు నైపుణ్యాన్ని అందించేలా రూపొందించబడ్డాయి.
పరికరాలు మరియు స్వయంచాలక వ్యవసాయ యంత్రాలకు సంబంధించిన మహీంద్రా విస్తృత నెట్‌వర్క్ చానల్ పార్ట్‌నర్లు, బాగా శిక్షణ పొందిన, సమగ్రమైన, మరియు ప్రతిస్పందిత సేవా బృందం ద్వారా వ్యవసాయ సీజన్‌లో విడిభాగాలు మరియు తగిన సమయానికి సేవలను సులభంగా పొందగలిగేలా నిర్ధారిస్తుంది.
మేము దేశవ్యాప్త చానల్ పార్ట్‌నర్ల నెట్‌వర్క్ ద్వారా ట్రాక్టర్ పరికరాలు మరియు స్వయంచాలక వ్యవసాయ యంత్రాలకు విక్రయ మరియు విక్రయానంతర సేవలను అందిస్తాము. మా డీలర్ నెట్‌వర్క్‌కు సంబంధించిన సమాచారం కోసం మమ్మల్ని సంప్రదించండి.
ట్రాక్టర్ పరికరాలు మరియు స్వయంచాలక వ్యవసాయ యంత్రాల 80% వ్యక్తిగత ఫైనాన్సింగ్ కొరకు మేము అనేక ప్రముఖ ఫైనాన్షియర్‌లతో భాగస్వామ్యాలు కలిగి ఉన్నాము. మరింత సమాచారం కోసం, మీ సమీప మహీంద్రా ట్రాక్టర్ డీలర్‌ను లేదా మమ్మల్ని సంప్రదించండి.