ప్రేర్ణ అనేది వ్యవసాయ రంగంలో భారతీయ మహిళలను మద్దతు తెలుపడానికి మరియు వారిని శక్తివంతులుగా చేయడానికి ఉద్దేశింపబడినది. మహిళలు తరచుగా వ్యవసాయపు కనిపించని ముఖం అనే నానుడిపై ఆదారపడి ఉన్నది. భారత్లో వ్యవసాయ రంగంలో 1౦౦ మిలియన్ల మహిళలు పనిచేస్తున్నారు , వీరిలో చాలా మంది పొలాలలో శ్రమతో కూడిన మరియు నడుములు విరిగేలా ఎక్కువ గంటలపాటు పనిచేస్తారు , తరచుగా మహిళలకు అనుకూలమైనవి కానటువంటి పనిముట్లుమరియు సాధనాలతో పనిచేస్తూ ఉంటారు. ఇన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ, మామూలుగా పురుషుల కన్నా వీరికి తక్కువ డబ్బులు చెల్లిస్తారు.
ప్రేర్ణ క్రింద మొట్టమొదటి ప్రాజెక్ట్ మహీంద్ర & మహీంద్ర, భారత దేశ ప్రభుత్వపు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసర్చ్ (ఐసిఎఆర్) యొక్క విభాగం అయిన సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ వుమెన్ ఇన్ అగ్రికల్చర్ (సిఐడబ్ల్యుఎ) మరియు ఎన్జిఒ -ప్రదాన్ (ప్రొపెషనల్ అసిస్టెన్స్ ఫర్ డెవల్ప్మెంట్ ఏక్షన్) మధ్య సంయోగం, మహిళలకు స్నేహపూర్వకమైన , సమర్ధవంతమైన మరియు ఎర్గోనామిక్స్ పొలం పనిముట్లు మరియు సాధనాల ప్రోత్సాహంతో చక్కగా రూపొందించబడిన లక్ష్యంగా చేసుకున్న మధ్యవర్తిత్వంతో ఈ సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పొలంలో పనిచేసే మహిళల పని విషయంలో సామర్ధ్యత మరియు ఉత్పాదకతను పెంచాలని ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టున్నది, ఇది తిరిగి వ్యవసాయ రంగంలో కొనసాగే వృద్ధికి దారితీస్తుంది. ఈ ప్రాజెక్ట్ మొదట్లో ఒడిసా రాష్ట్రంలో 30 కంటే ఎక్కువ గ్రామాలలో 1500 కంటే ఎక్కువ కుటుంబాలలో వారి జీవితాలపై సానుకూలమైన ప్రభావం చూపాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించబడుతుంది.
ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి అదనంగా, సాదారణ ప్రజానీకం నుండి వ్యవసాయంలో పనిచేసే మహిళల జీవితాలను మెరుగుపరచడానికి మార్గాలను గురించి అభిప్రాయాలను సేకరించడానికి వీలుగా మహింద్రా ఒక పోటీని కూడా ప్రవేశపెట్టింది. పోటీ విజేత ప్రతిష్ఠాత్మకమైన మహీంద్ర సమృద్ధి బహుమతులకు విశేషంగా ఆహ్వానాన్ని అందుకుంటారు, ఇది వ్యవసాయ రంగంలో ప్రవేశ పెట్టిన వినూత్నపద్ధతులను మరియు దోహదాన్ని గుర్తించే వార్షిక కార్యక్రమం. పోటీ పేజీకి లింకు పేజి. www.prerna-bymahindra.com