ట్రాక్టరు గురించి తరచూ అడిగే ప్రశ్నలు

మహీంద్రా ట్రాక్టర్స్కి సంబంధించిన మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు పొందండి. మరిన్ని వివరాల కొరకు, మా టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయండి లేదా మీకు సమీపంలో ఉన్న మా డీలర్షిప్ని సందర్శించండి.

 • మహీంద్రా ట్రాక్టర్స్ భారతీయ కంపెనీయా?

  అవును. మహీంద్రా ట్రాక్టర్స్ భారతీయ కంపెనీ మరియు దేశంలో ప్రముఖ ట్రాక్టర్ తయారీదారుగా మరియు గత 37 సంవత్సరాలుగా మార్కెట్లో అగ్రగామిగా ఉంది. వాల్యూమ్ పరంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారు కూడా, ఇది ఉత్తర అమెరికా, మెక్సికో, బ్రెజిల్, టర్కీ, దక్షిణాఫ్రికా మరియు జపాన్తో సహా 40కి పైగా దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

 • మహీంద్రా ట్రాక్టర్స్ ఎప్పుడు ప్రారంభమైంది?

  మహీంద్రా ట్రాక్టర్స్ ద ఇంటర్నేషనల్ ట్రాక్టర్ కంపెనీ ఆఫ్ ఇండియా (ఐటిసిఎల్)గా ప్రారంభమైంది. ఇది 1963లో ఇంటర్నేషణల్ హార్వెస్టర్ కంపెనీ మరియు ఓల్టాస్ లిమిటెడ్తో మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క జాయింట్ వెంచర్. ఐటిసిఎల్ 1977లో మహీంద్రా అండ్ మహీంద్రాలో విలీనమైంది, తద్వారా ట్రాక్టర్ డివిజన్ ప్రారంభమైంది.

 • మహీంద్రా ట్రాక్టర్స్ యొక్క వ్యవస్థాపకులు ఎవరు?

  మహీంద్రా ట్రాక్టర్స్ మహీంద్రా గ్రూప్ యొక్క ఫ్లాగ్షిప్ కంపెనీ. మహీంద్రా గ్రూప్ వ్యవస్థాపకులు ఘులామ్ మహమ్మద్తో పాటు ఐ.సి మహీంద్రా మరియు కె.సి మహీంద్రా అనే సోదరులు.

 • మహీంద్రా ట్రాక్టర్స్ ఎంతగా నమ్మకమైనది?

  మహీంద్రా ట్రాక్టర్స్ అవార్డు గెలుచుకున్న ట్రాక్టర్ తయారీదారు. ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన అవార్డుల్లో ఒకటైన టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్కి (టిక్యూఎం) మేము డెమింగ్ ప్రైజ్ అందుకున్నాము. జపాన్ క్వాలిటీ మెడల్ని గెలుచుకున్న ప్రపంచంలోని మొట్టమొదటి ట్రాక్టర్ తయారీదారు కూడా మేమే.


  మా నుంచి ట్రాక్టర్ కొనేటప్పుడు, అత్యుత్తమ ధరకు గొప్ప నాణ్యమైన ఉత్పాదన లభిస్తుందనే హామీ మీకు ఉంటుంది. మేము కచ్చితమైన నాణ్యత పరీక్షలు మరియు నియంత్రణలు చేస్తాము. మేము వివిధ బ్రాండ్ల కింద విస్త్రుత రేంజిలో మేము ఉత్పాదనలు అందిస్తాము. ఇవి ఇంధనాన్ని పొదుపు చేయడమే కాకుండా ఉత్పాదకతను పెంచేందుకు అవసరమైన ఆధునిక టెక్నాలజీని కూడా మేము అందిస్తాము. మార్చిన భాగాలు సిద్ధంగా లభిస్తాయి. మేము విస్త్రుత సర్వీసు నెట్వర్క్ అందిస్తున్నాము. ఇవన్నీ మాది ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన, అత్యధికంగా అమ్ముడుపోతున్న ట్రాక్టర్ తయారీదారు.

 • మహీంద్రా ట్రాక్టర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

  మహీంద్రా ట్రాక్టర్స్ ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. మా చిరునామా:

  మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్.
  ఫార్మ్ ఎక్విప్మెంట్ సెక్టార్,
  ఫార్మ్ డివిజన్,
  1వ అంతస్తు, మహీంద్రా టవర్స్,
  అకుర్లి రోడ్డు, కాందివలి (ఈస్ట్),
  ముంబయి-400 101

 • నేను మహీంద్రా ట్రాక్టర్స్లో ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు?

  మీరు మా కెరీర్ పోర్టల్ని సందర్శించి పోస్టు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీ లొకేషన్ మరియు ప్రాధాన్యమిస్తున్న ఉద్యోగ రకాన్ని ఇవ్వడం ద్వారా అందుబాటులో ఉన్న ఉద్యోగాలను మీరు సెర్చ్ చేయవచ్చు. అనువైన ఉద్యోగ అవకాశం కలిగినప్పుడు నొటిఫికేషన్ పొందడానికి మీరు ఎలర్ట్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

 • మహీంద్రా ట్రాక్టర్స్ని ఎక్కడ తయారుచేస్తున్నారు?

  మహీంద్రా ట్రాక్టర్స్ని భారతదేశంలోని రుద్రపూర్, జైపూర్, నాగ్పూర్, జహీరాబాద్, మరియు రాజ్కోట్ల్లో తయారుచేస్తున్నాము. చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మరియు ఆస్ట్రేలియాలో కూడా మాకు తయారీ కర్మాగారాలు ఉన్నాయి.

 • నేను మహీంద్రా ట్రాక్టర్స్ ఎందుకు కొనాలి?

  మేము 37 సంవత్సరాలుగా రైతులతో సన్నిహితంగా పనిచేస్తూ వాళ్ళ అవసరాలు మరియు సవాళ్ళను మెరుగ్గా అర్థంచేసుకున్నాము. రైతుల మరియు విభిన్న రకాల నేలల అవసరాలను తీర్చేందుకు మేము విస్త్రుత రేంజి ట్రాక్టర్లను అందిస్తున్నాము. మా రేంజిలో మహీంద్రా ఎస్పి ప్లస్, మహీంద్రా ఎక్స్పి ప్లస్, మహీంద్రా జివో, మహీంద్రా యువో, మరియు మహీంద్రా అర్జున్ నోవో ఉన్నాయి. మహీంద్రా ట్రాక్టర్స్ని కొన్న రైతులు దీని యొక్క శక్తివంతమైన ఇంజిన్, మంచి మైలేజ్, ఎసి క్యాబిన్, 11.2 కెడబ్ల్యు (15 హెచ్పి) నుంచి 55.2 కెడబ్ల్యు (74 హెచ్పి) తమ వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా చేస్తున్నారు.

 • మహీంద్రా ట్రాక్టర్స్ మినీ ట్రాక్టర్లను తయారుచేస్తుందా?

  మహీంద్రా ట్రాక్టర్స్ని గార్డెన్స్ మరియు పండ్ల తోటల్లో ఉద్యానవన పంటలను పండించేందుకు ప్రాథమికంగా ఉపయోగిస్తున్నారు. ఇవి కాంపాక్టు సైజుల్లో వస్తూ, ప్రత్తి, ద్రాక్ష, లెంటిల్స్, దానిమ్మ, చెరకు, వేరుశనగ లాంటి వివిధ రకాల పంటలకు దీనిని అనువైనదిగా చేస్తున్నాయి. వీటిని ల్యాండ్ ఫ్రాగ్మెంటింగ్ మరియు ఆపరేషన్-అనంతర పనికి కూడా మీరు ఉపయోగించవచ్చు. ఉత్తమంగా అమ్ముడుపోతున్న మహీంద్రా జివో రేంజి ఉన్నాయి.

 • నేను భారతదేశంలో మహీంద్రా ట్రాక్టర్స్ డీలర్ని ఎలా అవ్వవచ్చు?

  దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా మేము భారతదేశంలో మహీంద్రా ట్రాక్టర్స్ డీలర్స్తో కొలాబరేషన్ ఏర్పాటు చేసుకున్నాము మరియు ఎదిగాము. ట్రాక్టర్ షోరూమ్ డీలర్షిప్ కోసం దరఖాస్తు చేయడానికి మీరు మా డీలర్షిప్ పోర్టల్ని సందర్శించి మీ లొకేషన్ ఇవ్వాలి మరియు దరఖాస్తు ఫారం నింపాలి.,

 • కొత్తగా ప్రారంభించిన ట్రాక్టర్లు ఏమిటి?

  మహీంద్రా ట్రాక్టర్స్ ఎప్పటికప్పుడు మారుతున్న వ్యవసాయ పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనేక రకాల మోడల్స్ని అందిస్తోంది.

  ఎస్పి ప్లస్: మహీంద్రా ఎస్పి ప్లస్ ట్రాక్టర్స్ తమ కేటగిరిలో అతితక్కువ ఇంధన వినియోగంతో అత్యంత శక్తివంతమైనవి. శక్తివంతమైన ఇఎల్ఎస్ డిఐ ఇంజిన్, హై మ్యాక్స్ టార్క్ మరియు సర్వోన్నత బ్యాక్అప్ టార్క్ వల్ల,సకల ఫార్మింగ్ పరికరాలతో సాటిలేని పనితీరు ఇది ఇస్తుంది. మోడల్స్లో ఉన్నవి:

  • • మహీంద్రా 275 DI SP ప్లస్
   • మహీంద్రా 275 DI TU SP ప్లస్
   • మహీంద్రా 415 DI SP ప్లస్
   • మహీంద్రా 475 DI SP ప్లస్
   • మహీంద్రా 575 DI SP ప్లస్

  ఎక్స్పి ప్లస్: మహీంద్రా ఎక్స్పి ప్లస్ ట్రాక్టర్ల రేంజికి హై మ్యాక్స్ టార్క్ ఉంది, ఇది పరికరాలన్నిటితో, సర్వోన్నత బ్యాక్అప్ టార్క్తో బాగా పనిచేస్తుంది, తద్వారా సాటిలేని పవర్ మరియు పనితీరు అందిస్తుంది. మోడల్స్లో ఉన్నవి:

  • • మహీంద్రా 275 DI XP ప్లస్
   • మహీంద్రా 275 TU XP ప్లస్
   • మహీంద్రా 415 DI XP ప్లస్
   • మహీంద్రా 475 DI XP ప్లస్
   • మహీంద్రా 575 DI XP ప్లస్
   • మహీంద్రా 585 DI XP ప్లస్

 • భారతదేశంలో మహీంద్రా ట్రాక్టర్స్లో ఎంతమంది డీలర్లు ఉన్నారు?

  దేశ వ్యాప్తంగా మాకు 1,400 టచ్ పాయింట్లు ఉన్నాయి. భారతదేశంలో మీకు సమీపంలో ఉన్న మహీంద్రా ట్రాక్టర్స్ షోరూమ్స్ని మరియు ట్రాక్టర్ డీలర్స్ని తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి మరియు మీ లొకేషన్ని ఇవ్వండి.

 • మహీంద్రా ట్రాక్టర్స్ యొక్క టోల్ ఫ్రీ నంబరు ఎంత?

  మహీంద్రా ట్రాక్టర్స్ టోల్ ప్రీ నంబరు 18004256576, కమ్యూనికేషన్ కోసం ఇది రోజూలో24/7 అందుబాటులో ఉంటుంది. ఏదైనా సహాయం కోసం మీరు మమ్మల్ని [email protected] లో కూడా సంప్రదించవచ్చు.

 • మహీంద్రా ట్రాక్టర్స్ యొక్క హెచ్పి రేంజి ఎంత?

  మహీంద్రా ట్రాక్టర్స్ 15 నుంచి 74 హెచ్పి వరకు అనేక రకాల మోడల్స్ని తయారుచేస్తోంది. 20 హెచ్పి వరకు మహీంద్రా ట్రాక్టర్స్ కోసం చూస్తున్నప్పుడు, మీరు మహీంద్రా యువరాజ్ 215 ఎన్ఎక్స్టిని ఎంచుకోవచ్చు. మరింత శక్తివంతమైన ట్రాక్టర్ కోసం, మహీంద్రా అర్జున్ అల్ట్రా-1 605 డిఐని లేదా మహీంద్రా నోవో 755 డిఐని కొనే విషయం పరిశీలించండి. మీ వ్యవసాయ అవసరాలకు సరిపోయేలా మా వద్ద అనేక రకాల ట్రాక్టర్లు ఉన్నాయి.

  • మహీంద్రా జివో: కాంపాక్ట్ ట్రాక్టర్స్, వ్యవసాయ పనులన్నిటికీ అత్యంత అనుకూలమైనవి
   మహీంద్రా ఎక్స్పి ప్లస్: శక్తివంతమైన ఇంజిన్లు మరియు అతితక్కువ ఇంధన వినియోగం గల టఫ్ ట్రాక్టర్ల రేంజి.
   మహీంద్రా ఎస్పి ప్లస్: శక్తివంతమైన ట్రాక్టర్లు అత్యధిక ఇంధన పొదుపు, హై మ్యాక్స్ టార్క్ ఇస్తోంది.
   మహీంద్రా యువో: సాంకేతికంగా అధునాతనమైన ట్రాక్టర్లు తమ యొక్క అడ్వాన్స్డ్ హైడ్రాలిక్స్, శక్తివంతమైన ఇంజిన్, ప్రత్యేకతలు సమృద్ధిగా ఉన్న ట్రాన్స్మిషన్తో పనులు ఉత్తమంగా, వేగవంతంగా చేస్తున్నాయి.
   అర్జున్ నోవో: హాలేజ్, పడ్లింగ్, రీపింగ్, హార్వెస్టింగ్తో సహా 40కి పైగా పనులు చేసేందుకు నిర్మించబడింది.

 • మహీంద్రా ట్రాక్టర్స్ పవర్ స్టీరింగ్లో లభిస్తోందా?

  అవును, మహీంద్రా ట్రాక్టర్స్ పవర్ స్టీరింగ్ ఆప్షన్లు ట్రాక్టర్లను డ్రైవ్ చేయడాన్ని దీన్ని సులభతరం చేస్తున్నాయి. పవర్ స్టీరింగ్ ఆప్షన్ గల మహీంద్రా ట్రాక్టర్స్ రేంజి జాబితా ఈ కింద ఇవ్వబడింది.


  • • మహీంద్రా జివో: పవర్ స్టీరింగ్
   • మహీంద్రా ఎక్స్పి ప్లస్: డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్
   • మహీంద్రా ఎస్పి ప్లస్: డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్
   • మహీంద్రా యువో: పవర్ స్టీరింగ్
   • అర్జున్ నోవో: పవర్ స్టీరింగ్, డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్

🍪 Cookie Consent

Cookies are not enabled on your browser, please turn them on for better experience of our website !

🍪 Cookie Consent

This website uses cookies, please read the Terms and Conditions.

.